Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా

మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళనతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే మణిపూర్ అంశం పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.అటు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మణిపూర్ హింస, తాజా అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అన్ని కార్యకలాపాలనూ పక్కనపెట్టి.. మణిపూర్ అంశంపై మాత్రమే సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో.. సభను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img