బాబుతో పవన్ కీలక విషయాలను చర్చించే అవకాశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును వీరు ములాఖత్ ద్వారా కలవనున్నారు. వీరితో పాటు నారా లోకేశ్ కూడా జైలుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నాయి. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే మధురపూడి గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. చంద్రబాబుతో సమావేశానంతరం నారా భువనేశ్వరిని పవన్ పరామర్శించనున్నారు.
ఖీబశ్రీశ్రీంషతీవవఅ మరోవైపు జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పవన్, బాలయ్య వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీగా అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్ కాలేజీ వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు.