Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చంద్రబాబు నివాస భవనం జప్తుకు అనుమతి

. తొలుత భవన యజమాని లింగమనేనికి నోటీసు ఇవ్వాలి
. సీఐడీ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి కరకట్ట సమీపంలో నివాసముంటున్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌హౌస్‌ జప్తుపై ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే లింగమనేని రమేశ్‌కు ముందుగా నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేశ్‌ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్‌హౌస్‌ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం పై మేరకు తుది తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img