Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

చంద్రబాబును తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణుల నిరసనలు.. రూటు మార్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో ఈ ఉదయం 6 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. తమ అధినేతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును తరలిస్తున్న రోడ్డు మార్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కాన్వాయ్ రూటును పోలీసులు మార్చారు. పొదిలి నుంచి ఒంగోలు వైపు కాన్వాయ్ ని మళ్లించారు. గుంటూరు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img