Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-56

కౌంట్‌డౌన్‌ ప్రారంభం

విశాలాంధ్రసూళ్లూరుపేట: పీఎస్‌ఎల్వీ సీ-56 (పోలార్‌ సాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 6.31 గంటలకు తిరుపతి జిల్లా, శ్రీహరికోట, సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌ల్వీ సీ56 నింగిలోకి దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ను ఇస్రో ప్రయోగిం చనుంది. దీని కోసం శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. 25 గంటల 31 నిమిషాల అనంతరం ప్రయోగం జరుగుతుంది. సింగపూర్‌కు చెందిన డీఎస్‌-సార్‌ అనే ఉపగ్రహంతో పాటు మరో ఆరు నానో ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. సింగపూర్‌కు చెందిన వివిధ ప్రైవేటు కంపెనీల నానో ఉపగ్రహాలలో వేలోక్స-ఏఎం, ఆర్కేడ్‌, స్కూబీ -11, న్యూ లైన్‌, గాలాసియా-2, ఓఆర్బి-12, స్త్రీడర్‌ ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం కాగా ఇస్రో ఇప్పటి వరకు 92 రాకెట్లను షార్‌ నుంచి ప్రయోగించింది. 34 దేశాల 424 వాణిజ్య ఉపగ్రహాలను కూడా ప్రయోగించింది. శ్రీహరి కోట చుట్టుపక్కల సీఐఎస్‌ఎఫ్‌తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయోగం విజయతంతం కావాలని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img