ఏపీకి మరోసారి వర్ష సూచన చేసిన వాతావరణశాఖ
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు. అల్ప పీడనం ప్రభావంతో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయంటున్నారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా, బాపట్ల, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఈ వాన దెబ్బకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వానతో జనాలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. ఏలూరు, బాపట్ల, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి.