Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఏపీ ప్రజలకు చల్లని కబురు.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీకి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు పడనున్నాయని వెదర్ బులిటెన్‌లో తెలిపింది. నేడు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. 4వ తేదీ పార్వతీపురం మన్యం, విజయనగరం, కాకినాడ, చిత్తూరు, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనుండగా.. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడనున్నాయి.6వ తేదీ వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం లభించనుంది. వర్షాలతో పాటు రానున్న మూడు రోజుల పాటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాల్లోని కొన్ని మండలాలకు తీవ్ర వడగాల్పులు, మరికొన్ని మండలాలకు సాధారణ స్థాయిలో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత, వడగాల్పుల వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మినహా బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 4 మండలాలు, ఏలూరులోని కుకునూర్ మండలం, పార్వతిపురంలోని కోమరాడ, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ఈ మండలాల్లో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో 46 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 4 మండలాల్లో, అనకాపల్లి జల్లాలోని మూడు మండలాల్లో, అనంతపురం జిల్లాలోని 7 మండలాల్లో, బాపట్ల జిల్లాలోని 11 మండలాల్లో, ఈస్ట్ గోదావరి జిల్లాలోని 13 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో, గుంటూరు జిల్లాలోని 20 మండలాల్లో, కాకినాడ జిల్లాలోని 10 మండలాల్లో, కృష్ణా జిల్లాలోని 12 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు.ఇక కర్నూలు జిల్లాలోని 8 మండలాల్లో, నంద్యాల జిల్లాలోని 20 మండలాల్లో, ఎన్టీఆర్ జిల్లాలోని 10 మండలాల్లో, పల్నాడు జిల్లాలోని 25కిపైగా మండలాల్లో, పార్వతీపురం, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, వైఎఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీయనున్నారని ఏపీ విపత్తు నిర్వహణశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img