గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 44.3 అడుగులుగా నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 9,74,666 క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు.