Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రమాదకర తీర్పు

మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి సుప్రీం ఆమోదంపై 17 ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత
ఈడీ వంటి సంస్థలకు మరిన్ని అధికారాలపై అభ్యంతరం
‘రాజకీయ ప్రతీకారానికి’ బలాన్నిస్తుందని ఆందోళన
తీర్పును సమీక్షించాలని ఉమ్మడి ప్రకటనలో అభ్యర్థన

న్యూదిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)కి 2019లో చేసిన సవరణలను సమర్థిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 17 ప్రతిపక్ష పార్టీలు ‘ప్రమాదకరమైనది’గా అభివర్ణించాయి. ప్రత్యర్థు లను లక్ష్యంగా చేసుకొని ‘రాజకీయ ప్రతీకారానికి’ పాల్పడే ప్రభుత్వ చేతులను ఈ తీర్పు బలోపేతం చేస్తుందని, ఈ ప్రమాదకరమైన తీర్పు స్వల్పకాలికంగానే ఉంటుందని, త్వరలో రాజ్యాంగ నిబంధనలు అమలులోకి వస్తాయని తాము ఆశిస్తున్నామని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్‌సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సమాజ్‌ వాదీ పార్టీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఇతరులు సంతకం చేసిన ఒక ఉమ్మడి ప్రకటన పేర్కొంది. ‘ఈ సవరణల్లో కొన్నింటిని ఆర్థిక చట్టం ద్వారా అమలు చేయవచ్చో లేదో పరిశీలించకుం డానే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం, 2002కి చేసిన సవరణలను పూర్తిగా సమర్థిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దీర్ఘకాలిక పరిణామాలపై మా తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాము’ అని వివరించాయి. ‘మేము సుప్రీం కోర్టు పట్ల ఎల్లప్పుడూ గౌరవమర్యాదలు కలిగి ఉంటాము. అయినప్పటికీ సవరణలు చేయడానికి ఆర్థిక చట్టం మార్గం రాజ్యాంగబద్ధతను పరిశీలిం చడానికి ఒక పెద్ద బెంచ్‌ తీర్పు కోసం వేచి ఉండాలని మేము సూచించవలసి వచ్చింది’ అని పేర్కొన్నాయి. ‘మనీలాండరింగ్‌, దర్యాప్తు సంస్థలకు సంబంధించి చాలా సవరించిన చట్టాలను ఉపయోగించడం ద్వారా తమ రాజకీయ ప్రత్యర్థు లను దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడా నికి ఈ సుదూర సవరణలు ప్రభుత్వ హస్తాలను బలోపేతం చేశాయి’ అని తెలిపారు. ‘ఆ చట్టానికి సంబంధించి పరిశీలనలు లేకుండానే అత్యున్నత న్యాయ వ్యవస్థ ఒక స్వతంత్ర తీర్పు ఇవ్వడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. చట్టంలోని క్రూరమైన సవరణలకు కార్యనిర్వాహకుల వాదనలను ఇది వాస్తవంగా ప్రతిబింబించింది. ప్రమాదకరమైన తీర్పు స్వల్పకాలికంగా ఉంటుందని, త్వరలో రాజ్యాంగ నిబంధనలు అమలులోకి వస్తాయని మేము ఆశిస్తున్నాము’ అని తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
దాదాపు 250 పిటిషన్ల ద్వారా సవాలు చేసిన సవరించిన చట్టం ప్రకారం ఈడీకి ఇచ్చిన విస్తృత శ్రేణి అధికారాల చెల్లుబాటును జులై 27న సుప్రీం కోర్టు సమర్థించింది. అలాగే అరెస్టు చేసే అధికారాలు, ‘నేర రాబడి’ అస్పష్టమైన నిర్వచనాన్ని దుర్వినియోగం చేయవచ్చనే కీలక వాదనలను కోర్టు తిరస్కరించింది. ‘టీఎంసీ, ఆప్‌ సహా 17 ప్రతిపక్ష పార్టీలు, రాజ్యసభ స్వతంత్ర ఎంపీ ఒకరు పీఎంఎల్‌ఏ 2002కి సవరణలను సమర్థిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దీర్ఘకాలిక పరిణామాలపై తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తూ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. తీర్పును సమీక్షించాలని అభ్యర్థించాయి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, సమీక్ష కోరేందుకు తాము మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతామని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తెలిపాయి. చట్టం ప్రకారం చాలా తక్కువ శిక్షలు మాత్రమే ఉన్నాయని వారు ఉదహరించారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటయిన ఎనిమిదేళ్లలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటి వరకు ఈడీ దాడులు 26 రెట్లు పెరిగాయి. కానీ నేరారోపణ రేటు చాలా తక్కువగా ఉంది. 3,010 మనీలాండరింగ్‌ సంబంధిత సోదాల్లో కేవలం 23 మంది నిందితులు మాత్రమే దోషులుగా తేలారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడిరచిన వివరాల ప్రకారం, ఈ 112 శోధనలలో మనీలాండరింగ్‌ నేరారోపణలు లేవు. నేషనల్‌ హెరాల్డ్‌ ప్రచురణకు సంబంధించిన కేసులో కాంగ్రెస్‌ గాంధీలను ఈడీ ప్రశ్నించినప్పుడు ప్రతీకార ఆరోపణలు ఇటీవల పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాకుండా ఈ సవరణలను పార్లమెంటులో ఏ విధంగా ముందుకు తెచ్చారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఆ ప్రశ్న ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు ఉంది. వీటిని ఒక ‘మనీ బిల్లు’గా ప్రవేశపెట్టిన ఆర్థిక చట్టం కింద ఆమోదించినట్లు ప్రకటన ఎత్తి చూపింది. మనీ బిల్లు అంటే కొత్త నిబంధనలకు తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపే ముందు, లోక్‌సభ నుంచి ఆమోదం మాత్రమే అవసరం. ప్రభుత్వం కచ్చితంగా ఆమోదం పొందేందుకు సంఖ్యలు లేని ఎగువ సభ అయిన రాజ్యసభ ద్వారా తిరస్కరణకు గురికాదు. ‘ఆర్థిక చట్టం ద్వారా సవాలు చేయబడిన సవరణలు చట్టపరంగా చెడ్డవని రేపు సుప్రీం కోర్టు భావిస్తే, అప్పుడు మొత్తం కసరత్తు వ్యర్థమవుతుంది. న్యాయపరమైన సమయాన్ని కోల్పోతుంది’ అని ప్రతిపక్ష పార్టీల ప్రకటన పేర్కొంది. ప్రతిపక్షం పెద్ద వాదన ఏమిటంటే, మనీ బిల్లు తప్పనిసరిగా సంచిత నిధి నుంచి డబ్బును కేటాయించడం, పన్ను విధించడం, ఇతర విషయాలపై చట్టాలు చేయడానికి ఉపయోగించబడదు.
అయితే, న్యాయస్థానం గత వారం తీర్పును వెలువరిస్తూ, ‘మనీలాండరింగ్‌ దేశం సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఉగ్రవాదం, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు వంటి ఇతర దారుణమైన నేరాలను కూడా ప్రోత్సహిస్తుంది’ అని తెలిపింది. కేసు నివేదిక ప్రతి ద్వారా నిందితులకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసే అధికారాలు రాజ్యాంగ విరుద్ధమన్న వాదనను తోసిపుచ్చింది. ప్రతి కేసులో ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక) ఇవ్వడం తప్పనిసరి కాదని, ఎందుకంటే ఇది అంతర్గత పత్రమని కోర్టు పేర్కొంది. ఇది ఎఫ్‌ఐఆర్‌ను పోలి ఉందని, నిందితుడికి కాపీని పొందే అర్హత ఉందన్న పిటిషనర్ల సవాలును తోసిపుచ్చింది. అరెస్టు సమయంలో ఈడీ చర్యకు గల కారణాలను నిందితులకు చెబితే సరిపోతుందని కోర్టు పేర్కొంది. నిందితులపై రుజువు భారాన్ని మోపడమంటే, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనంటూ పిటిషనర్లు సవాలు చేశారు. కానీ కోర్టు అంగీకరించలేదు. మనీలాండరింగ్‌ నేరాలు తీవ్రమైనవని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని, నిందితులపై రుజువు భారం న్యాయమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలాఉండగా, దేశ రాజధానిలోని నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రిక ప్రాంగణంలో, ఇతర చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img