Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాజద్రోహ చట్టం 124ఎ అమలుపై స్టే

రాజద్రోహం చట్టం 124ఎ అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. అంతే కాకుండా ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతూల్యతను పాటించాల్సిన అవసరం కూడా ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడిరది. 124ఎ సెక్షన్‌ కింద జైల్లో ఉన్నవారు కూడా బెయిల్‌ కోసం న్యాయస్థానాలకు వెళ్ళవచ్చని సూచించింది. కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు 124ఎ సెక్షన్‌ కింద ప్రభుత్వాలు కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్లు కూడా ఇది వలసవాద చట్టంగా పేర్కొన్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
అయితే కేంద్రం వాదనతో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టంపై సమీక్ష పూర్తయ్యేంత వరకు రాజద్రోహ ఉపయోగించడం సరికాదన్నారు. అప్పటిదాకా ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని, ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్డును ఆశ్రయించ్చు అని సీజేఐ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img