సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మేరకు శుక్రవారం సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం ప్రకటనను విడుదల చేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారని, ఆయన చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. సీతారాం ఏచూరి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నారు. గురువారం ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు.