. కారును ఢీకొట్టి బోల్తా పడ్డ భారతి బస్సు..
. 63మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
. బాదితుల్లో ఏడుగురి పరిస్థితి విషమం..
. 108, వైద్యులు, పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణనష్టం..
. క్షతగాత్రులను పరామర్శించిన ఆర్డీవో మురళి, డిఎస్పీ కేసప్ప..
. గాయపడిన వారికి దగ్గరుండి వైద్యం అందించిన జనసేన నేత రాందాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష..
. ప్రమాదంపై లోతుగా దర్యాప్తు ప్రారంభిస్తున్నాం ఆర్డిఓ, డిఎస్పి..
. బాధితులు, బంధువుల ఆర్థనాదాలతో అట్టుడికిన జిల్లా ఆసుపత్రి…
విశాలాంధ్ర – మదనపల్లి రురల్ : అతివేగం తెచ్చిన అనర్థం ముందు వెళ్తున్న కారును భారతి బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో 70 మంది ప్రయాణికుల్లో 63 మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఏడు మంది పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మదనపల్లి బెంగళూరు రోడ్డులోని వేంపల్లి పంచాయతీ, కూకటి మాను గడ్డలో గురువారం ఉదయం చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు, బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుంచి మదనపల్లి మీదుగా తిరుపతికి వెళుతున్న భారతి ప్రైవేట్ బస్సు ఉదయం సుమారు 10 గంటల సమయంలో మదనపల్లి సమీపంలోని, బెంగళూరు రోడ్డు వేంపల్లి పంచాయతీ కూకటిమాను గడ్డ వద్ద ముందు వెళుతున్న కారును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి ఎడమవైపున రోడ్డు పక్కన వుండే 20అడుగుల లోతున్న గుంతలోకి బోల్తా పడిరది. ఈ హఠాత్ పరిణామం లో బస్సులో ప్రయాణిస్తున్న 70 మందిలో 63 మంది తీవ్రంగా గాయపడి కాళ్లు చేతులు విరిగి హా హా కారాలు పెట్టారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రజలు రైతులు గ్రామస్తులు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారందరినిస్థానికుల సాయంతో సురక్షితంగా బయటికి తీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న108 వాహన సిబ్బంది గోపి, మను, మస్తాన్, చలపతి తదితరులు క్షతగాత్రులను అంబులెన్స్లలో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అపర్ణమైన డీఎస్పీ కేశప్ప, ఆర్డీవో మురళి జిల్లా ఆస్పత్రికి చేరుకుని జతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.. అప్పటికే ఆస్పత్రి ఆర్‌ఎంవో దివాకర్ నేతృత్వంలో వందమంది వైద్య సిబ్బంది గాయపడిన వారికి అత్యవసర విభాగంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. బెడ్లు చాలక పోవడంతో ఒక్కో బిడ్డ పైన మూడు నుంచి ఐదు మందిని పడుకోబెట్టి చికితలు చేశారు. నేల పైననే మరికొందరికి వైద్యం అందించారు. ఆగ మేఘాలపై ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్ లు తీసి ప్రాణాపాయంలో ఉన్న శారదమ్మ, లావణ్య, చందన, గిరీష్ రెడ్డి, కృష్ణప్ప, రక్షిత, రామ్మోహన్ తో పాటు బస్సు కాండక్టర్ జమీల్ అహమ్మద్ 60కి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తిరుపతి రూయ ఆసుపత్రులకు డాక్టర్లు రెఫర్ చేశారు. ఆర్డివో, డీఎస్పీల ఆదేశాలతో ప్రైవేట్ అంబులెన్స్ లలో బెంగళూరు తిరుపతి రుయా ఆసుపత్రులకు శతకాతులను తరలించారు. తక్కిన 56 మందికి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలోనే చికిత్సలు అందిస్తున్నారు.
108 బృందం, ,వైద్య బృందం, పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణ నష్టం: 108 సిబ్బంది గోపి మను మస్తాన్, అమర, దివ్య ల బృందం తో పాటు వైద్య బృందం, పోలీసుల సమయస్ఫూర్తితో జతగాత్రులకు సకాలంలో అత్యవసర వైద్య చికిత్సలు అందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను నిలబెట్టారు. దీంతో వీరి సేవలను బాధితుల కుటుంబీకులు, ప్రజాప్రతినిధులు అధికారులు అభినందించారు. దగ్గరుండి బాధితులకు సేవలు అందేలా చూసిన ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్, జనసేన నేత రాందాస్ చౌదరి బస్సు బోల్తా పడి గాయపడి ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న వారికి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే మరియు టిడిపి నాయకులు షాజహాన్ భాష, జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి దగ్గరుండి మెరుగైన వైద్య సేవలు అందించడం అత్యవసర కేసులను తిరుపతి బెంగళూరుకు తరలించడం చేయించారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకుని వారి బంధువులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడి ఆసుపత్రికి రప్పించారు. మానవత్వాన్ని చూపి న వీరు శభాష్‌అనిపించుకున్నారు.
ఒక్కరు కూడా చనిపోకూడదు: ఆర్డిఓ, డిఎస్పి: రోడ్డు ప్రమాద బాధితులు జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొంది త్వరగా కోలుకోవాలి. ఒక్కరు కూడా చనిపోవడానికి వీలు లేదు. వైద్యుల బృందాన్ని రప్పించి మెరుగయిన అత్యవసర చికిత్సలు అందించాలని డాక్టర్ల బృందానికి వైద్య సిబ్బందికి మదనపల్లి ఆర్డీవో మురళి, మదనపల్లి డిఎస్పి కేశప్ప ఆదేశించారు. దగ్గరుండి క్షత్తగాత్రులకు సపర్యలు చేయించారు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో మాట్లాడి అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకొని అత్యవసర కేసులను వెంటనే ప్రైవేట్ హాస్పటల్ కు తరలించాలని ఆదేశించారు. అత్యవసర చికిత్సలు అందడంతో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారని వారు సంతృప్తిని వ్యక్తం చేశారు.
క్షతగాత్రులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్: బెంగళూరు రోడ్డులో బస్సు బోల్తా పడి గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న 63 మంది చతగాత్రులను మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనూజ కిరణ్ రెడ్డి, వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి, రాయల్ మురళి, నరేష్ కుమార్ రెడ్డిలు పరామర్శించారు.
బస్సు బోల్తా ఘటనపై లోతుగా దర్యాప్తు : బెంగళూరు రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్పీ కేస్ అప్ప ఆర్డిఓ మురళి తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సంఘన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు నుంచి వేంపల్లి చెన్నకేశవ స్వామి గుడి వద్దకు వస్తున్న కారులోని రాఘవేంద్ర, నిఖిల్, సుధీంద్ర, విజయేంద్ర స్వామిలకు ఇలాంటి గాయాలు కాకపోయినప్పటికీ వారు కారును సడన్గా నిలబెట్టడంతో అతివేగంగా వస్తున్న బస్సు కారును ఢీకొని అదుపుతప్పి పక్కనున్న 20 అడుగుల లోతుల్లోని గుంతలో పడి 63 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడాల్సి వచ్చింది అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని డిఎస్పి తేల్చి చెప్పారు. దానికి తోడు అధిక లోడు కెపాసిటీ మించి 70 మంది ప్రయాణికులను బస్సులో తరలించడం నిబంధనలకు విరుద్ధం మని చెప్పారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లతోపాటు పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి బస్సు డ్రైవర్ రాఘవ, యజమానులపై చర్యలు ఉంటాయని చెప్పారు.