Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మణిపూర్‌లో మళ్లీ మొదలు..

భద్రతా దళాలు-సాయుధుల మధ్య తుపాకి కాల్పులు
చెదురుమదురు ఘటనలు మినహా కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తెంగ్‌నౌపాల్ జిల్లాలో ఈ తెల్లవారుజాము నుంచి భద్రతా దళాలు, సాయుధుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు మొదలైన కాల్పులు అడపాదడపా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించినట్టు కానీ, గాయాలైనట్టు కానీ సమాచారం లేదు. భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్చో ఇఖాయ్‌లో రెండు రోజుల క్రితం వేలాదిమంది ఆందోళనకు దిగారు. వదిలిపెట్టిన తమ ఇళ్లలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆర్మీ బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మరోమారు ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆందోళనకారులను నిలువరించేందుకు ఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో ఐదు జిల్లాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. మణిపూర్ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img