Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెన్షన్‌

సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వెళ్లడాన్ని పరారీగా భావిస్తూ చర్యలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) పెండ్యాల శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసు నిబంధనలు అతిక్రమించి ఉన్నతాధికారులకు తెలపకుండా ఆయన అమెరికా వెళ్లారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని కారణంగా ఆయన పరారీలో ఉన్నట్లు భావిస్తూ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం సచివాలయంలోని ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో శ్రీనివాస్‌ను కూడా సీఐడీ నిందితుడిగా చేర్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకి సంబంధించి ఐటీ జారీ చేసిన నోటీసుల్లో శ్రీనివాస్‌ పేరుంది. ఆయన ద్వారానే చంద్రబాబుకి నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img