London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఉగ్ర ముప్పు

డిల్లీ లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థ నుంచి దాదాపు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. కేవలం ఆగస్టు 15నే ఈ దాడి జరుగుతుందని తాము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భద్రతా చర్యలు భారీగా ఉండటంతో రెండ్రోజుల తర్వాత కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర సంభాషణను నిఘా వర్గాలు వినడంతో ఈవిషయం బట్టబయలైంది. ఇటీవల కథువు వద్ద సంచరించిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు పఠాన్‌ కోట్‌లోకి చొరబడి నక్కే అవకాశాలను కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు, అతివాదులు, ఉగ్రవాదులతో స్థానికంగా జరిగే స్వాతంత్ర్య వేడుకలు, అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకం కలిగించేలా పథకాన్ని రచిస్తున్నట్లు భద్రతా వర్గాల చెబుతున్నాయి. ఇటీవల పరిణామాలను చూస్తే కథువా, దోడా, ఉధంపుర్‌, రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో ఉగ్ర కదలికలున్నట్లు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img