Friday, December 1, 2023
Friday, December 1, 2023

అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధ కూటమి పరాజయం

ఐరాసలో వీగిపోయిన కెనడా సవరణ ప్రతిపాదన
ఇజ్రాయిల్‌`హమాస్‌ సంధికి పిలుపునిస్తూ తీర్మానం

. మద్దతిచ్చిన 120 దేశాలు
. వ్యతిరేకించిన 14 దేశాలు
. ఓటింగ్‌కు భారత్‌ దూరం
. ఇజ్రాయిల్‌కు పరోక్ష మద్దతు

జెనీవా: గాజాపై ఇజ్రాయిల్‌ దండయాత్రను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆక్షేపించాయి. తక్షణమే దాడులను ఆపాలని, గాజాకు మానవతా సాయాన్ని అందజేయాలని నొక్కిచెప్పాయి. ఇదే అంశమై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో సమగ్రంగా చర్చలు జరిగాయి. దాదాపు అన్ని దేశాలు పలస్తీనా పక్షాన్నే నిలిచాయి. దీంతో ఇజ్రాయిల్‌ ఏకపక్ష దాడులతో రక్తసిక్తమైన గాజాకు తక్షణ నైతిక ఓదార్పు లభించినట్లు అయింది. ఫలితంగా ఇజ్రాయిల్‌`అమెరికా యుద్ధ కూటమి ఓడిపోయింది.
గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పలస్తీనాకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టారు. మానవతా దృక్పథంతో వెంటనే దాడులను విరమించాలని ఇజ్రాయిల్‌కు సూచిస్తూ… సంధికి పిలుపునించేలా తీర్మానం ఉంది. కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న గాజా ప్రజలకు మానవతా సాయం తక్షణమే అందించాలని కోరింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించగా 120 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. దీంతో ఇజ్రాయిల్‌అమెరికా యుద్ధ కూటమికి పరాభవం తప్పలేదు. చిన్నాచితక 14 దేశాలు మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించాయి. హమాన్‌ను ఉగ్రవాద సంస్థగా చాలా కొద్ది దేశాలు గుర్తించాయి. ఐరాస దానిని ఉగ్రవాద సంస్థగా ముద్రవేయలేదన్నది గమనార్హం. తాజా తీర్మానంలో ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి ప్రస్తావన లేదంటూ ఓటింగ్‌ నుంచి భారత్‌ తప్పించుకుంది. ఓటింగ్‌కు దూరంగా ఉండటం ద్వారా తనది ఎవరి పక్షమో చెప్పకనే చెప్పింది. దీంతో భారత్‌ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే కావాల్సిన ఓట్లు రావడంతో పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలో ఆమోదం లభించింది. భారత్‌, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్‌, ఉక్రెయిన్‌, బ్రిటన్‌ సహా 45 దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. జోర్డాన్‌ ప్రతిపాదిత తీర్మానంలో హమాస్‌ గురించి ప్రస్తావన లేకపోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఇజ్రాయిల్‌పై దాడులను పట్టించుకోలేదని విమర్శించింది. ఓటింగ్‌కు ముందు అమెరికా మద్దతుతో కెనడా ఒక సవరణను ప్రతిపాదించింది. అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా బేషరతుగా బందీల విడుదలను సూచించింది. ఈ సవరణకు భారత్‌ సహా 87 దేశాలు మద్దతివ్వగా 55 దేశాలు వ్యతిరేకించాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మెజారిటీ రాకపోవడంతో సవరణ తీర్మానం వీగిపోయింది. ఈమేరకు ఐక్యరాజ్యసమితి 78వ జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు డాన్నిస్‌ ఫ్రాన్సిస్‌ వెల్లడిరచారు. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఓట్లు రావడంతో ఆ దేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. నాజీ ఉగ్రవాదులకు అంతర్జాతీయ సమాజం కొమ్ముకాసిందని వ్యాఖ్యానించింది. ఐరాస సభ్యదేశాలు 193 కాగా వీటిలో అమెరికాఇజ్రాయిల్‌ పక్షాన్న నిలిచినది ఏడు శాతమే. ఈ 14 దేశాల్లో అమెరికా, ఇజ్రాయిల్‌ మినహాయిస్తే చెప్పుకోదగ్గ దేశాలు లేవు. దీంతో 75ఏళ్ల ప్రపంచ పోలీసు అమెరికాకి ఓటమి ఎదురైనది. జీ7 కూటమి సభ్యదేశాల్ని తన వెంట నిలబెట్టుకోలేకపోవడం కూడా అమెరికాకు పరాభవమే. ఐదు శాశ్వత సభ్యదేశాల్లో… జీ-7 దేశాల్లో నుంచి అమెరికా తప్ప ఏ దేశం యుద్ధ అనుకూల వైఖరిని ప్రదర్శించలేదు. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తున్నది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఇది మరింత బలపడిరది. కానీ అమెరికా ఈసారి ఒంటరైంది. ఆకస్‌ కూటమి, క్వాడ్‌ కూటమి నుంచి అమెరికా ఏకాకి కావడం గమనార్హం. అరబ్‌ లీగ్‌లోని 21 దేశాలతో కలిపి ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థలో 56 దేశాలు ఉన్నాయి. వీటిలో ఇరాక్‌ మాత్రమే ‘అబ్‌స్టెయిన్‌’ దేశాల్లో ఉంది. మిగిలిన దేశాలు గాజాకు మద్దతిస్తూ ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్‌ చేశాయి. ఇదిలావుంటే దక్షిణాసియాలో భారత్‌ ఒక్కటే ఇజ్రాయిల్‌కు పరోక్ష మద్దతు తెలిపింది. దురాక్రమణను వ్యతిరేకించలేదు. మరోవైపు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక తీర్మానానికి అనుకూలంగా ఓటేసి గాజా పక్షాన నిలిచి ఇజ్రాయిల్‌ దాడులను ఖండిరచాయి. ఏదిఏమైనా అంతర్జాతీయ సమాజం స్థూలంగా విజ్ఞత ప్రదర్శించింది.
మానవతా సాయానికి ఈయూ బ్రస్సెల్స్‌ సదస్సు తీర్మానం
గాజాకు తక్షణమే సాయం అందించేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడం అత్యవసరమని, బాంబు దాడులను ఆపి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సదస్సు తీర్మానించింది. 27 సభ్యదేశాల ఈయూ…బ్రసెల్స్‌లో నిర్వహించిన రెండు రోజుల సదస్సు ముగిసింది. ఇజ్రాయిల్‌హమాస్‌, ఉక్రెయిన్‌, రష్యా మధ్య పోరుపై సదస్సు వాడీవేడిగా చర్చించింది. ఈ సందర్భంగా గాజాలో భీకర పోరు ఆ ప్రాంతానికే కాదు మొత్తం ప్రపంచానికి చాలా ప్రమాకరంగా పరిణమించవచ్చని ఈయూ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖెల్‌ అన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఈయూ ప్రయత్నిస్తోందన్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడటం, అన్ని వేళలా పౌరుల రక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే అంతర్జాతీయ శాంతి సదస్సు జరిపించాలనే ప్రతిపాదనకు ఈయూ మద్దతిచ్చింది. గాజాలో బ్లాకౌట్‌తెగిపోయిన సంబంధాలు
హమాస్‌ నియంత్రణలోని గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులతో ఆ ప్రాంతంలో మొత్తంగా బ్లాకౌట్‌ నెలకొంది. అన్ని రకాల సంబంధాలు తెగిపోయాయి. శుక్రవారం సాయంత్రం ఉత్తర గాజాలో ఇజ్రాయిల్‌ భీకర దాడులతో ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ ధ్వంసమైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడిరచింది. గాజా స్ట్రిప్‌లో బాంబు దాడుల కారణంగా మొబైల్‌ ఫోన్‌ సేవలు, అంతర్జాల సేవలన్నీ దెబ్బతిన్నట్లు పలస్తీనా టెలికం సంస్థ తెలిపిది. ఏ నెట్వర్క్‌ కూడా పనిచేయడం లేదని, తమ వారిని చేరుకోలేకపోతున్నట్లు అల్‌ జజీరా వార్తా సంస్థ కూడా ప్రకటించింది.
‘అక్కడ ఏం జరుగుతోందో తెలియదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంతుపట్టడంలేదు. ఎంత మంది బాధితులు ఉన్నారో సమాచారం లేదు’ అని ఖాన్‌ యూనిస్‌ విధుల్లో ఉన్న జర్నలిస్ట్‌ ఒకరు తెలిపారు. కాగా 22 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే 7,300 మంది పలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఇందులో మూడువేల మందికిపైగా చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img