Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

బాంబు పేలుడుతో దద్దరిల్లిన సిరియా రాజధాని.. పలువురి మృతి

సిరియా రాజధాని డమాస్కస్‌ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. సయ్యదా జీనాబ్‌ ప్రార్థనా మందిరం బయట జరిగిన ఈ దాడిలో పలువురు మృతి చెందగా మరెంతోమంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. పేలుడులో ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చిత సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img