Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి కాల్ డేటాను సేకరించాలి : టీడీపీ నేత బుద్దా వెంకన్న

దేశ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టు సంచలనంగా మారిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ అరెస్టు కాబట్టే జాతీయస్థాయి నాయకులు స్పందించారన్నారు. జగన్ నుంచి 42 వేల కోట్ల రూపాయలు ఆస్తులను ఈడీ జప్తు చేసిందని.. తనను దొంగ అని జైలుకు పంపించారని జగన్ కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. తన ప్రత్యర్థి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ కుట్ర చేశారని విమర్శించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లు సరికాదని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. వారు మోపిన అభియోగానికి ఆధారాలు కూడా లేవని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్‌లో అవినీతి లేదని సంస్థ ఛైర్మన్ ఓపెన్‌గా ప్రకటించారన్నారు. ఆడిటర్లు ఎవరు వచ్చినా తాను చర్చకు రెడీ అని చెప్పారన్నారు. నేడు న్యాయ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారని.. ఇటువంటి కేసుల ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు కేసు విషయంలో న్యాయమూర్తి సరైన తీర్పు ఇవ్వలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img