Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మణిపూర్‌ లో రూ.1800 లకు చేరిన వంట గ్యాస్‌ ధర..ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు

రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. మూడు వారాల నుంచి మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మణిపూర్‌ కు ట్రాన్స్‌ పోర్ట్‌ సేవలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌ కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడిరది.పంపిణీ నిలిచిపోయాయి. దీంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. బియ్యం, ఉల్లిగడ్డ, బంగాళదుంప, కోడిగుడ్ల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ లోయతో పాటు అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో బియ్యం ధర 50 కిలోలకు రూ.1800 లకు చేరింది. గతంలో ఇది రూ.900 లు ఉండేదని ప్రజలు చెబుతున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్‌ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు. ఇంఫాల్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.170 కి చేరింది. కోడిగుడ్ల ధర ఒక్కొక్కటి రూ.10 కి చేరిందని, కిలో బంగాళదుంప రూ.100కు చేరిందని ఇంఫాల్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైతీ తెగను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ జాబితాలో చేర్చుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో వివాదం ప్రారంభమైంది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img