Friday, December 8, 2023
Friday, December 8, 2023

బిల్లులపై నాన్చివేత ధోరణి తగదు

. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచన
. పంజాబ్‌ గవర్నర్‌ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూదిల్లీ: ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లకు ఆత్మపరిశీలన అవసరమని వ్యాఖ్యానించింది. పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ బిల్లుల ఆమోదించడంలో చేస్తున్న జాప్యంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదంలో జాప్యంపై దాఖలైన కేసుపై సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘బిల్లుల విషయాలు సుప్రీంకోర్టు వద్దకు రాకముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్లు అలా వ్యవహరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. గవర్నర్‌లకు ఆత్మ పరిశీలన అవసరం. అలాగే వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయం వారు తెలుసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్‌ గవర్నర్‌ తీసుకున్న చర్యలపై ‘తాజా స్థితి’ నివేదికను సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. అనంతరం ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు పురోహిత్‌ ఆమోదం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఉన్నట్లే పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ కు మధ్య వైరం నెలకొంది. ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో గవర్నర్‌ తాత్సారం చేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతించే ముందు ప్రతిపాదిత చట్టాలను మెరిట్‌పై పరిశీలిస్తానని చెబుతూ భగవంత్‌ మాన్‌కు లేఖ రాసిన కొన్ని రోజుల తర్వాత నవంబర్‌ 1న, పురోహిత్‌…మూడు ద్రవ్య బిల్లులలో రెండిరటికి ఆమోదం తెలిపారు. సభలో ద్రవ్య బిల్లులు పెట్టాలంటే గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి. అయితే, అక్టోబరు 19న సీఎంకు రాసిన లేఖలో గవర్నర్‌ మూడు ద్రవ్య బిల్లుల ఆమోదాన్ని నిలిపేసినట్లు వెల్లడిరచారు. వాటిల్లో పంజాబ్‌ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2023 – పంజాబ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సవరణ) బిల్లు – 2023, ఇండియన్‌ స్టాంప్‌ (పంజాబ్‌ సవరణ) బిల్లు – 2023కి పురోహిత్‌ ఉన్నాయి. బడ్జెట్‌ సెషన్‌కు పొడిగింపుగా అక్టోబర్‌ 20-21న నిర్వహించిన సెషన్‌ చట్టవిరుద్ధం అని గవర్నర్‌ గతంలో వ్యాఖ్యానించారు. తాజా తీర్పు అనంతరం పరిణామాలను కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. గవర్నర్‌ తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img