Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఆసీస్ ఆటగాడి కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీ..!

మండిపడుతున్న నెటిజన్లు

వరల్డ్ కప్‌ ట్రోఫీపై కాళ్లు ఉంచి ఫొటో దిగిన మిచెల్ మార్ష్

కప్ గెలవడమే కాదు గౌరవించడం కూడా నేర్చుకోవాలని సూచన

ప్రపంచ కప్ గెలవాలనే ప్రపంచం మొత్తం పాదాక్రాతంమైందనుకున్నాడేమో గానీ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్.. వరల్డ్ కప్ ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఫొటో దిగాడు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు ఆసీస్ ఆటగాడిపై మండిపడుతున్నారు. గెలుపు గర్వం తలకెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు. భారత్ గెలిస్తే ఆటగాళ్ల గుండెలపై ఉండాల్సిన ట్రోఫీ ఆసీస్ ఆటగాళ్ల కాళ్ల కింద నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కప్ గెలిస్తే సరిపోదు దాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. టోర్నీ ఆసాంతం ఓటమనేది ఎరగకుండా.. అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడటం ఫ్యాన్స్‌కు బాధించింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రవర్తన అంతకు మించి బాధపడేలా చేస్తోంది. ఎవరైనా వరల్డ్ కప్ గెలిచాక.. ట్రోఫీని ముద్దాడుతూనో.. చేతుల్లో పట్టుకొనో ఫొటో దిగుతారు. కానీ టీ20ల్లో ఆస్ట్రేలియా కాబోయే కెప్టెన్‌ మిచెల్ మార్ష్ మాత్రం ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఫొటోలు దిగాడు. ప్రపంచం మొత్తం మా పాదాక్రాంతమైందని చెప్పేలా ఆ ఫొటో ఉంది. ఒకటికి ఆరుసార్లు ప్రపంచ కప్ గెలిచిన గర్వం అతడి కళ్లలో కనిపించింది. మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు అతడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరుతున్నారు. కప్‌ను గౌరవించాల్సింది పోయి.. ఇలా నిస్సిగ్గుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఎఫర్ట్ లేకుండా అయాచితంగా అన్ని దొరికితే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఓ నెటిజన్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంతోనే వాళ్లు ఈ కప్ గెలవడానికి అర్హులు కారని నేను అనుకుంటున్నానంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్ గెలిస్తే.. మన క్రికెటర్లు ఆ కప్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారు. కానీ బ్యాడ్ లక్.. మనం వరల్డ్ కప్ గెలవలేకపోయాం. గెలిచినోళ్లకేమో గర్వం తలకెక్కిందని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img