Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

కరోనా మూలాలు వుహాన్‌ ల్యాబ్‌లోనే ఉన్నాయనడానికి ఆధారాల్లేవు : అమెరికా

కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటపడిరదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో నిజం లేదని, ఇందుకు సంబంధించి నేరుగా ఎలాంటి సాక్ష్యాలు లేవని అమెరికా నిఘా విభాగాలు వెల్లడిరచాయి. ఈ మేరకు ‘ఆఫీస్‌ ఆఫ్‌ ద డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌’ (వోడీఎన్‌ఐ) నాలుగు పేజీల నివేదికలో పేర్కొంది. వైరస్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని తోసిపుచ్చలేమని, అయితే, ఇందుకు సంబంధించి మహమ్మారి మూలాలను ఇప్పటి వరకు కనుగొనలేకపోయామని పేర్కొంది.మహమ్మారి కచ్చితమైన మూలాన్ని కేంద్ర నిఘా విభాగంతోపాటు మరో ఏజెన్సీ కూడా గుర్తించలేకపోయిందని వోడీఎన్‌ఐ తెలిపింది. కరోనా వైరస్‌ సహజంగా పుట్టిందా? ల్యాబ్‌లో తయారైందా? అన్నది పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కరోనాపై వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ (డబ్ల్యూఐవీ) విస్తృతంగా పనిచేసినప్పటికీ అమెరికా ఏజెన్సీలు మాత్రం మహమ్మారి మూలాలకు సంబంధించిన ఆధారాలను కనుగొనలేకపోయాయని నివేదిక వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img