Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హమ్మయ్యా… ఆ నలుగురు క్షేమం!

మచిలీపట్నం : వారం రోజుల నిరీక్షణకు తెరపడిరది. సముద్రంలో చేపలవేటకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… మచిలీపట్నం క్యాంబెల్‌పేటకు చెందిన కొందరు మత్స్యకారులు నాలుగు పడవల్లో ఈ నెల ఒకటో తేదీన సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీరప్రాంతంలో చేపలవేట ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో నలుగురు ఉన్న ఒక పడవ సాంకేతిక సమస్య వల్ల సముద్రంలోనే నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన మిగిలిన మూడు పడవల వారు గాలించినా ఆ పడవ జాడ కనిపించలేదు. అప్పటి నుంచి వారి కోసం బంధువులు, ప్రభుత్వ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా రెండు హెలికాప్టర్లతో సముద్రంలో పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు మత్స్యకారులు అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీర ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు రెస్క్యూ బృందం గుర్తించింది. వారిని ఇవాళ సాయంత్రానికి మచిలీపట్నం తీసుకొచ్చే అవకాశం ఉంది. నలుగురు మత్స్యకారులు సురక్షితంగా కనిపించడం ఆనందంగా ఉందని మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) సంతోషం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img