Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

80 మంది చిన్నారులకు టమోటా ఫీవర్‌

కేరళలో టమోటా ఫీవర్‌ కలకలం రేపుతోంది. 80 మంది చిన్నారులకు టమోటా ఫీవర్‌ సోకడంతో ఆ రాష్ట్రంలో భయాందోళనలు మొదలయ్యాయి. అయిదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి సోకుతోంది. టమోటా ఫీవర్‌ వ్యాప్తిపై తమిళనాడులోనూ ఆందోళన నెలకొన్నది. చిన్నారుల్లో గుర్తు తెలియని జ్వరం వస్తోందని, అది టమోటా ఫీవర్‌ అని, అయితే అది వైరల్‌ అవుతుందా లేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. టమోటా ఫీవర్‌ వ్యాప్తిపై తమిళనాడులోనూ ఆందోళన నెలకొన్నది. దీంతో సరిహద్దు జిల్లాల్లో పరీక్షలు చేపడుతున్నారు. కోయంబత్తూర్‌లో ఎంట్రీ అవుతున్నవారికి ఫీవర్‌ పరీక్షలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ బోర్డర్‌ వద్ద ఫ్లూ లక్షణాలు ఉన్నవారి కోసం గుర్తింపు జరుగుతోంది. వాహనాల్లో వెళ్తున్న చిన్న పిల్లలకు ఇద్దరు మెడికల్‌ అధికారులు పరీక్షలు చేస్తున్నారు. టమోటా ఫీవర్‌ సోకిన చిన్నారుల్లో దద్దులు, దురద, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img