Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?..

పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి విమర్శలు

కొంత కాలంగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డివిపక్ష పార్టీలు, నేతలపై మళ్లీ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ఃకొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు…వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు? అంటూ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img