Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర కేబినెట్లోకి వైసీపీ?

తిరుపతి/ఏలూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, మంచి సంబంధాలు వున్నాయని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ చెప్పారు. ఇందులో దాచడానికి ఏమీ లేదని, జగమెరిగిన సత్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తీసుకురాగలుగుతున్నామని అన్నారు. మంగళవారంనాడు తిరుమల పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే కేంద్రం నుంచి రావాల్సి ఉందని శ్రీధర్‌ వెల్లడిరచారు. హోదా ఇస్తామంటే కేంద్ర క్యాబినెట్‌లోకైనా చేరడానికి సిద్ధమని కోటగిరి శ్రీధర్‌ పరోక్షంగా తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక రహోదా సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. 2024లో వైసీపీకి మరో అవకాశం వస్తుందని, అప్పుడు కేంద్రంలో చేరే అవకాశం వస్తే ప్రత్యేక హోదా షరతు పెట్టి కచ్చితంగా హోదా సాధిస్తామని కోటగిరి శ్రీధర్‌ వెల్లడిరచారు. అంటే హోదా హామీతో కేంద్ర క్యాబినెట్‌లోకి చేరడానికి వైసీపీ సుముఖంగా వుందని ఆ పార్టీ చెప్పకనే చెపుతోందన్నమాట! ఇంకా పలు విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తున్న అంశంపై పలుమార్లు విపక్షాలు విమర్శలు చేస్తుంటాయని, కానీ ఇందులో దాపరికమేమీ లేదని కోటగిరి శ్రీధర్‌ తెలిపారు. మూడేళ్లుగా ప్రతీ బిల్లుకూ మద్దతిచ్చామని ఆయనన్నారు. అంతే కాదు కేంద్రానికి అలా మద్దతిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్‌కు నిధులు వస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు. కాగా, శ్రీధర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి. (Story: ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర కేబినెట్లోకి వైసీపీ?)

See Also

‘మహా’ సర్కారు త్వరలోనే కూలిపోతుంది: మమతా బెనర్జీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img