Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

కాంగ్రెస్‌లో చేరిన గంటల వ్యవధిలోనే.. విజయశాంతికి కీలక బాధ్యతలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మెుదలైంది. మరో 12 రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్ర అవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విలూరుతోంది. డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మెుత్తం 66 హామీలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక ప్రచారంలో దూకుడు పెంచేందుకు గాను తాజాగా..కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో శుక్రవారం పార్టీలో చేరిన విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో చేరి 24 గంటలు గడవకముందే.. ఆమెకు పెద్దపీఠ వేశారు. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా విజయశాంతిని నియమించారు. ఈ కమిటీలో మెుత్తం 15 మందిని కన్వీనర్లుగా నియమించగా.. కొత్త, పాత నేతల కలయిగా ఈ కమిటీలను నియమించారు.

మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ పారిజాత నర్సింహా రెడ్డి కూడా కమిటీలో చోటు కల్పించారు. కోదండరెడ్డి, మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, రాములు నాయక్, సమరసింహారెడ్డి, పుష్పలీల, అనిల్, పిట్ల నాగేశ్వరరావు, ఒబెదుల్లా కొత్వాల్, రామ్మూర్తి నాయక్, ఇబ్రహీం, దీపక్ జాన్, రమేష్ ముదిరాజ్, సిద్ధేశ్వర్లను ఈ కమిటీలో కన్వీనర్లుగా నియమించారు.

ఇక బీజేపీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె శుక్రవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కిషన్‌ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీపై ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయంట కలకలం రేపింది. అప్పట్లోనే పార్టీ మార్పుపై వార్తలు రాగా.. శుక్రవారం ఆమె కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img