Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశాంతియుత ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు

శాంతియుత ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు

- Advertisement -

ధర్మవరంలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, నవంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పట్టణానికి విచ్చేసి పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ధర్మవరం పట్టణంలోని 48 వార్డుల్లో 134 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో సుమారు 11 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.పట్టణంలో ప్రస్తుతం 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నలుగురికి మించి గుమికూడరాదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా రౌడీషీటర్లు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కేసులు ఉన్నవారికి సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని హెచ్చరించారు.ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లను పాటించాలని పోలీసులు కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు