Sunday, July 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచక్కెర వ్యాధి, థైరాయిడ్ ఉచిత పరీక్ష శిబిరాలు..

చక్కెర వ్యాధి, థైరాయిడ్ ఉచిత పరీక్ష శిబిరాలు..

సాంస్కృతిక మండలి, ఇన్నర్ వీల్ క్లబ్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాంస్కృతిక మండలిలో ఈనెల ఆరవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత చక్కెర వ్యాధి, థైరాయిడ్ పరీక్ష శిబిరమును నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఎస్. ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు, క్యాంపు చైర్మన్ గర్రె రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శరీరంలో గండికోట ఆస్పటల్ ఆధ్వర్యంలో డాక్టర్ జి రాజశేఖర్ రెడ్డి రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఈ శిబిరంలో షుగర్ రోగులకు ఎఫ్బిసి, పి పి బి ఎస్, హెచ్ బి ఏ ఐ సి, అదేవిధంగా థైరాయిడ్ రోగులకు టీ 3, టి 4, టి ఎస్ హెచ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు ఏమీ తినకుండా ఏమి త్రాగకుండానే ఉదయం 7 గంటల లోపు శిబిరమునకు హాజరుకావాలని తెలిపారు. ఈ సదవకాశాన్ని ధర్మవరం ప్రజలు సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 789345233 లేదా 9 44060247 లేదా 9440286540 కు సంప్రదించవచ్చునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు