ముఖ్యఅతిథి గుద్దిటీ సోమదాస్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఒక వరంలాగా లభిస్తాయని ముఖ్య అతిథి గుద్దిట్టి సోమదాసు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేశవనగర్లో గల సోమదాసు వైట్ హౌస్ లో మెహర్ బాబా శాశ్వత వైద్య శిబిరముల సేవా సంస్థను వారు ప్రారంభించారు. ఈ శిబిరంలో రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి వ్యక్తిత్వ మానసిక వికాస నిపుణులు లీలా మనోహర్, అధ్యాపకురాలు కుమారి మేడం, బిఎస్సార్ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తదితరులు పాల్గొని శిబిరం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ శిబిరం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సొసైటీ సామాజిక విభాగం సలహాదారులు, రెడ్ క్రాస్ సంస్థ డాక్టర్ సత్య నిర్ధారన్ అధ్యక్షతన నిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలను 50 మందికి నిర్వహించడం జరిగిందని, తద్వారా వారి యొక్క రక్తం యొక్క గ్రూపు తెలుసుకోవడం జరిగిందన్నారు. దీంతో ఈ రక్త గ్రూపు వలన ఇతరులకు రక్తం ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈనెల నాలుగవ తేదీ నుండి పట్టణంలోని కళాశాలలో కూడా రక్త పరీక్షలు చేయనున్నామని తెలిపారు. అలాగే ప్రతిరోజు బీపీ చెక్ అప్ కూడా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో వృద్ధుల కోసం, దివ్యాంగుల కోసం రక్త పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేస్తామని రెడ్ క్రాస్ సంస్థ నాయకులు పోలా ప్రభాకర్ తెలిపారు. అనంతరం రక్త పరీక్షల శిబిరాల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా నితిన్ సాయి, రవీంద్ర అనే విద్యార్థి ప్రథమ బహుమతి రాగా, రెండవ బహుమతి టి గణేష్, మూడో బహుమతి మనీ, నాలుగవ బహుమతికి ఎంపిక కావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా ప్రేమికురాలు సుజాత, పోలా ప్రభాకర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.ముఖ్యఅతిథి గుద్దిటీ సోమదాస్
ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఒక వరంలాగా లభిస్తాయి..
RELATED ARTICLES