Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండ–రాయంపల్లి రహదారికి రూ.3.35 కోట్ల నిధులు

ఉరవకొండ–రాయంపల్లి రహదారికి రూ.3.35 కోట్ల నిధులు

- Advertisement -

భూమి పూజ చేస్తున్న దృశ్యం

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ–రాయంపల్లి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.35 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. సుమారు 20 ఏళ్లుగా రహదారి కోసం ఎదురుచూస్తున్న ప్రజల సమస్యకు పరిష్కారం చూపుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి పయ్యావుల కేశవ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రేగాటి నాగరాజు చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే రూ.3 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రహదారి పనులు పూర్తికాగా, తాజాగా మంజూరైన రూ.3.35 కోట్లతో మరో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రహదారి పూర్తయితే ఉరవకొండ, రాయంపల్లి, నెరిమెట్ల, వ్యాసాపురం తదితర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. రహదారి నిర్మాణంతో ఈ ప్రాంత గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు