Sunday, July 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాలికలు తమంతకుతామే రక్షించుకొనే స్థాయికి ఎదగాలి..

బాలికలు తమంతకుతామే రక్షించుకొనే స్థాయికి ఎదగాలి..

ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుమలత. కార్యదర్శి లక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; బాలికలు తమంతకు తామే రక్షించుకునే స్థాయికి ఎదగాలని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు, లాయర్ సుమలత, కార్యదర్శి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గడ్డం వెంకటమ్మ యతిరాజులు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో (జడ్పీ గర్ల్స్ హై స్కూల్) 1098 కు సంబంధించినటువంటి వాటిపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అదేవిధంగా బాలికలు కరాటే లాంటి శిక్షణ కూడా పొందాలని, ఎటువంటి ఆధారం లేకుండా ఎవరిపై ఆధారపడకుండా ఒక అమ్మాయి తనను తాను ఎలా రక్షించుకోవాలని కొన్ని కరాటే ప్రదర్శనలు విద్యార్థినిలకు చూపించడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తదుపరి విద్యార్థినీలకు హ్యూమన్ రైట్స్ గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తో పాటు ఇన్నర్ బిల్ క్లబ్ సభ్యులు, హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు