- Advertisement -
సూర్య హై స్కూల్ కరెస్పాండెంట్ నరేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సూర్య హైస్కూల్లో తోలుబొమ్మల కళాకారులు చక్రికా, పర్ణిక లను ఘనంగా సన్మానించినట్లు సూర్య హై స్కూల్ కరెస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం పొందడం వలన మనకు, మన ధర్మవరం కు గర్వకారణం అని కొనియాడారు. అంతరించి పోతున్న కలలను ప్రాణం పోస్తున్న పిల్లల తండ్రి రామాంజనేయులు పాఠశాల ఉపాధ్యాయ బృందం కూడా ఘనంగా సన్మానించారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల తప్పనిసరిగా శ్రద్ధను ఘనపరచాలని తెలిపారు.


