Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

జగనన్న ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

విశాలాంధ్ర`పొన్నూరు : చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో జగనన్న కాలనీలోని గృహనిర్మాణ పనులను పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య శనివారం పరిశీలించారు. గ్రామంలోని 30 మంది ఎస్టీలకు ఇక్కడ ప్రభుత్వం నివేశన స్థలాలను పంపిణీ చేసింది. వీరికి వి.ఆర్‌.ఓ. అనే సంస్థ గృహాలను నిర్మిస్తోంది. పనుల పురోగతి పట్ల ఎమ్మెల్యే రోశయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు, వి.ఆర్‌.ఓ సంస్థ నిర్వాహకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img