Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పొన్నూరు దేవాలయాలను సందర్శించిన గుంటూరు మేయర్‌

విశాలాంధ్ర`పొన్నూరు : గుంటూరు నగర మేయర్‌ కావటి శివ నాగ మనోహర్‌ నాయుడు మంగళవారం పొన్నూరులోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వారల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సహస్ర లింగేశ్వర, శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల దేవస్థానం చైర్మన్‌ నాగసూరి ప్రతాప్‌ కుమార్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు రంగనాథ్‌ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు రుద్ర పాటి ఆదిశేషు, పలగాని రమేష్‌, కె.మోహన్‌, పట్టణ వైసీపీ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, యలవర్తి భరత్‌, యర్రంశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ఆర్య వైశ్య పొలిటికల్‌ చైర్మన్‌ చైతన్య తదితరులు కావటిని కలిసి అభినందించిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img