Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం, పరిహారం ఇవ్వాలి

డిల్లో పోరాటాలకు మద్దతుగా దీక్ష
విశాలాంధ్ర`చిలకలూరిపేట రూరల్‌: పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం, పరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. జంతర్‌ మంతర్‌లో పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యాన జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా గురువారం సీపీఐ కార్యాలయంలో దీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి ముందే పునరావాసం, పరిహారం పూర్తి చేయాలని అన్నారు. రెండేళ్లుగా ఆ ప్రాంతంలో వరదలచ్చి ప్రజానీకం మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 2019లో అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్‌ వెంటనే పూర్తి చేస్తామని, నిర్వాసితులకు, ఆదివాసీలకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చిన బిజెపి, ఇప్పుడు దానిని తుంగలో తొక్కిందన్నారు. పోలవరం ముంపు బాధితులైన ఆదివాసీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఆదివాసీల ఇళ్లను, పొలాలను, పశువులనే కాదు, వారి చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని వరదల్లో ముంచి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం పేదలు, దళితులు, ఆదివాసీలుి, మైనారిటీలపై అప్రకటిత యుద్దం సాగిస్తోందని, అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని వారు ఆరోపించారు. పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో గిరిజనులు, దళితుల అంశాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకునే బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తక్షణ సహాయం కింద ప్రతి నిర్వాసిత కుటుంబానికి నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలలుపాటు ఇవ్వాలని, నిత్యావసర సరకులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సుభాని, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు పేలూరి రామారావు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి సీహెచ్‌ నిర్మల, పట్టణ కార్యదర్శి బి శివలీల, నాయకులు వెంకటప్పయ్య మాస్టరు, నరసింహరావు, సృజన్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img