Monday, December 5, 2022
Monday, December 5, 2022

సీపీఐ దుర్గి మండల కార్యదర్శిగా శివయ్య

దుర్గి: మండల కేంద్రమ్తెన దుర్గిలోని మారుగొండ్ల వెంకటేశ్వర్లు ఇంటివద్ద సీపీఐ మండల నూతన కమిటీ కౌన్సిల్‌ సమావేశం మండల కార్యదర్శి చిట్టిప్రోలు ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యదర్శిగా కాలా శివయ్య, సహాయ కార్యదర్శిగా చిట్టిప్రోలు అమరేశ్వరావు, సభ్యులగా మారుగొండ్ల వెంకటేశ్వర్లు, మారుగొండ్ల ఆంజనేయులు, మారుగొండ్ల అమ్మోరయ్య, వ్తె.ఆనందరావు, మోతుకూరి కొండలు, గోరిగె శ్రీను, బత్తుల పెదకొండలు, వేమిరెడ్డి లచ్చిరెడ్డి, కొణతం దావీదు, బత్తుల వెంకటేశ్వర్లు, వేముల గంటారావు, మల్లెల శ్రీనులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి సభ్యులు బత్తుల ఏడుకొండలు, ఎఐవ్తెఎఫ్‌ మాచర్ల నియోజకవర్గ కార్యదర్శి నర్రా రంగస్వామి, ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి, మాచర్ల పట్టణ కార్యదర్శి మిద్దెపోగు బాబురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్‌ హూస్సేన్‌, ఎఐవ్తెఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుభాని, పార్టీ అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img