Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో వైద్యుని నిర్లక్ష్యం

విశాలాంధ్ర`మంగళగిరి: ఒక యువతికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసే విషయంలో నూతక్కి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం వైద్యుడు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీనితో నేటికి యువతి అస్వస్థతకు గురై ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ నెల 2వ తేదీ ఒక యువతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం నూతక్కి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఒక డాక్టర్ను తండ్రితో కలిసి సంప్రదించడం జరిగింది. అయితే ఆపరేషనుకు ముందు ఆమెకు మత్తు ఇంజక్షన్‌ ఇవ్వడం జరిగింది . అయితే ఆమెకు మత్తు ఎక్కకుండానే ఆపరేషన్‌ కోసం పొట్టపై ఓపెన్‌ చేయడం జరిగింది. రెండవ సారి ఇంజక్షన్‌ చేసిన కూడా అదే పరిస్థితి, ఆమె బాధ, ఏడ్పు నేపథ్యంలో సైతం వైద్యుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయడం జరిగింది. రెండు రోజుల తర్వాత ఆమెను పరీక్షించేటప్పుడు పొట్టపై బలంగా కుట్లు వద్ద నొక్కి వేయడంతో కుట్లు ఓపెన్‌ అయ్యాయి. అయినప్పటికీ అలాగే ఉంచి బ్యాండేజ్‌ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారింది. ఆపరేషన్‌ వద్ద పెద్ద రంధ్రం ఏర్పడిరది . అంతట వైద్యుడు తన బాధ్యత నుండి తప్పించుకునే విధంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేయడం జరిగింది. అయితే నేడు కరోనా నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకు వెళ్ళటానికి వారు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వారు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. నూతక్కి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం వైద్యుని నిర్వాహకం వలన, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిరదన్న చందంగా ఆ కుటుంబ పరిస్థితి అయింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య చికిత్స ఆపరేషన్లు జరుగుతాయని ఆశాభావంతో వచ్చిన ఆ కుటుంబానికి వైద్యుల నిర్లక్ష్యంతో నిరాశ మిగిలింది. నేడు అప్పులు చేసి తన కుమార్తెకు వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుందని తన బాధను వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి చికిత్స అందిస్తుంటే, కొందరు వైద్యుల నిర్లక్ష్యం పేద ప్రజల పాలిటీ శాపంగా మారుతోంది. జిల్లా ఉన్నత వైద్య శాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించి భవిష్యత్తులో రోగులకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరి పాలకులు, వైద్య శాఖ అధికారులు ఏం చేస్తారో వేచి చూడవలసిందే. వైద్యుని నిర్లక్ష్యంతో నూతక్కి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది.
అధికారులు తస్మాత్‌ జాగ్రత్త..!
పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులు ఒక వరం లాంటివి. నేటి హైటెక్‌ సమాజంలో కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ భరించలేని వారు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఫీజులు రూ.100 నుండి రూ. 500 వరకు గుంజుతున్నారు. అలాగే వైద్య పరీక్షలు చికిత్సలు పేరుతో వేల రూపాయలు గుంజుతూ ఉండటం జగమెరిగిన సత్యమే. గతంలో వైద్యో నారాయణో హరి అని ప్రజలు వైద్యులను కనిపించని దైవంతో పోల్చేవారు. అయితే నేడు కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వారి నిర్లక్ష్యంతో మరికొందరు రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా అటువంటిది మంగళగిరి మండలంలోని నూతక్కి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img