Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా బాపట్ల వ్యవసాయ కళాశాల అమృతోత్సవం

విశాలాంధ్ర – బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో సృష్టించబడిన బిపిటి-5204 వరి వంగడం అంతర్జాతీయ ఖ్యాతిని గడించడమే కాకుండా విశ్వవ్యాప్తంగా సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ప్రారంభిస్తూ ఆయన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 11వ స్థానంలో నిలిచి బోధనలో పరిశోధనలు విస్తరణలో ప్రత్యేక స్థానాన్ని సమపాధించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా దేశం మొత్తం మీద రూపొందించబడుతున్న వరి వంగడాల్లో 1/3 వ వంతు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమే సృష్టిస్తుందని ఆయన అన్నారు. గ్రామీణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవం తొలుత ఎడ్లబండ్లపై సంప్రదాయ కేరళ వాద్య బృంద మేళ తాళాలతో ఊరేగింపుగా ప్రారంభమైంది. శాస్త్రీయ భరత నాట్యం, విద్యార్థినీ విద్యార్థుల గ్రామీణ కోలాటాలు చేస్తుండగా డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల వ్యవసాయ సంబంధిత ప్రదర్శన శాలలను ప్రారంభించారు. పెవిలియన్ వద్ద జరిగిన బహిరంగ సభలో రికార్డ్ స్థాయిలో 1200 మందికి పైగాపూర్వ విద్యార్థులు ఈ కళాశాలతో తమకు గల అనుబంధాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు.అనంతరం ఉప కులపతి రైతు విగ్రహం వద్ద ప్లాటినం జూబ్లీ పైలాన్ ను మరియు బీపీటీ-5204 పైలానును ఆవిష్కరించారు. పైలాను వద్ద నుండి పెరేడ్ ఆఫ్ ప్రైడ్ రెట్రోవాక్ ను మేళ తాళాలతో నిర్వహించారు. అనెక్స్ భవనం వద్ద సంప్రదాయ రాజస్థానీ మరియు గ్రామీణ కోలాటాల తో వీరికి ఘన స్వాగతం పలికారు. 1975 సంవత్సర పూర్వ విద్యార్థులు 75 కొబ్బరి మొక్కలు నాటి సరికొత్త కొబ్బరి తోటను ప్రారంభించారు. పలువురు పూర్వ విద్యార్థులు నూతన అతిథి గృహ నిర్మాణానికి భూరి విరాళాలు అందజేశారు. అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన అమృతోత్సవంలో రిజిస్ట్రార్ డాక్టర్ జి రామారావు, వ్యవసాయ డీన్ డాక్టర్ ఏ. ప్రతాప్ కుమార్ రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ ప్రశాంతి విస్తరణ డైరెక్టర్ డాక్టర్ పి రాంబాబు విద్యార్థి విభాగ డీన్ డాక్టర్ పి. సాంబశివరావు కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ సిహెచ్ చిరంజీవి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ ఏ. మణి, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, పూర్వ అసోసియేట్ డీన్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img