Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చేనేత కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటాం

జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌
విశాలాంధ్ర`గుంటూరు : జిల్లాలో ఉన్న చేనేత కార్మికులు, చిన్న, మధ్య తరహా మగ్గం పరిశ్రమల వారిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని విధాలా పాల్గొంటామని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ వీవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కన్నా మాస్టర్‌(విన్నకోట వెంకటేశ్వర్లు) మాట్లాడుతూ నూలు పోగుతో గుడ్డను తయారుచేసి నాగరిక సమాజానికి దుస్తులు అందించిన చేనేత కార్మికులు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినా వారి బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లుంగి, టవలు, చేతి రుమాలు వంటి 11 రకాల దుస్తులు చేనేతలు మాత్రమే తయారు చేయాలని నిబంధనలు ఉన్నా పెద్ద పరిశ్రమలు తయారు చేస్తున్నప్పుడు వారిని నిరోధించలేకపోవటం దారుణమని అన్నారు. పేదవారికి అందించే చీరలు, ధోవతులు, పాఠశాల విద్యార్థుల దుస్తులు చేనేతవే కొనిడం ద్వారా వారిని ఆదుకోవడం జరుగుతుందని అన్ని రకాల సబ్సిడీలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉడతా పెద్దన్న, జీసీహెచ్‌ వీరయ్య, శివయ్య, నాగేశ్వరరావు, ఉడుత కృష్ణ, చిన్నం సుబ్బారావు, కోట సత్యం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img