Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు..

విశాలాంధ్ర – బాపట్ల : శాసనమండలి ఎన్నికల ప్రకటనతో బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. విజయకృష్ణన్ చెప్పారు. శాసనమండలి ఎన్నికల ప్రకటనతో జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్ట రేట్ నుంచి ఎన్నికల అధికారి వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు మార్చి 13వ తేదీన బాపట్ల జిల్లాలో జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి అధికారులు పనిచేయాల్సివుంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అధికారులు నిబద్ధతతో విధులు : నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియకు ప్రకకటన విడుదల చేయాల్సి – ఉందన్నారు. 23వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 27న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. -మార్చి-13వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలోని 13 మండలాలలో శాసనమండలి ఎన్నికలు జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 17,626 పురుష గ్రాడ్యుయేట్ ఓట్లు ఉండగా, 8,745 మహిళా గ్రాడ్యుయేట్ ఓట్లు, ఇతర క్యాటగిరిలో ఒకరు ఉన్నారని చెప్పారు. మొత్తంగా బాపట్ల జిల్లాలో 26,372 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. – క్యాచ్యుయేట్స్ నియోజవర్గం పరిధిలో 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో 13. పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1,400లోపు మాత్రమే ఓటర్ల ఉండాలన్నారు. ఆ సంఖ్యకు మించితే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటరు 16 కిలోమీటర్లలోనే ఓటు వేయాలనే నిబంధనను . విస్మరించరాదన్నారు.
పోలింగ్ కేంద్రాలను అధికారులు యుద్ధప్రాతిపదికన తనిఖీచేసి సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా ర్యాంప్ ఉండాలని, కేంద్రానికి తలుపులు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించి కలెక్టరేటుకు నివేదించాలన్నారు. నామినేషన్ల -ప్రక్రియ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. నకిలి ఓటర్ల తొలగింపుపై ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలన్నారు. ఓటర్ల ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అధికారులు విబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలననుసరించి అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారుల నియామకానికి గజిటెడ్ అధికారుల వివరాలను తెప్పించుకోవాలని డి.ఆర్.ఓ.ను కలెక్టర్ ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ బూతు నిర్వహణపై అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలపై పరిశీలకులను నియమించి ప్రత్యేక శిక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ఏ.ఎస్.పి. పి. మహేష్, డి.ఆర్.ఓ. – కె. లక్ష్మి శివజ్యోతి, బాపట్ల, చీరాల ఆర్.డి.ఓ.లు జి. రవీందర్, పి. సరోజని, జిల్లా అధికారులు, మండలస్థాయిఅధికారులు, తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img