Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మిర్చి మోసగాళ్లు అరెస్టు

విశాలాంధ్ర`తాడికొండ: మిర్చి మోసగాళ్ళను అరెస్టు చేసిన సంఘటన తాడికొండ ఎస్‌ఐ జి.వెంకటాద్రి గురువారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. బేజాత్‌ పురం గ్రామానికి చెందిన పట్టెం వెంకట్రావు అతని అల్లుడు ఎడ్లపల్లి రాములు కొన్ని సంవత్సరాలుగా మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రావెల గ్రామానికి చెందిన రైతుల వద్ద నుండి రూ.పాతిక లక్షలు విలువచేసే మిర్చిని కొనుగోలు చేశారు. రైతులకు రూ. 6లక్షలు చెల్లించి మిగతానగదు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రావెల గ్రామానికి చెందిన షేక్‌ అన్వర్‌ భాష మరో 11 మంది రైతులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంకట్రావు రాములు కొనుగోలు చేసిన మిర్చిని గుంటూరు నగరంలోని ఒక కమిషన్‌ షాపులో అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అక్కడ రావలసిన నగదును తీసుకొని బుధవారం రాత్రి స్వగ్రామం బేజాత్‌ పురం బయలుదేరారు . సమాచారం అందుకున్న పోలీసులు ఇరువురిని తాడికొండ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 10.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. మిర్చి రైతులు తాము పండిరచిన పంటను నేరుగా మార్కెట్‌ యార్డ్‌ లో విక్రయించు కోవాలని విజ్ఞప్తి చేశారు. మోసగాళ్లను నమ్మవద్దని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో స్టేషన్‌ సిబ్బంది శ్రీనివాసరావు, లోకేష్‌, రమాకాంత్‌ పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img