Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌కు 95వ ర్యాంకు

విశాలాంధ్ర`గుంటూరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) శుక్రవారం విడుదల చేసిన ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయిలో 95వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 95వ ర్యాంకు లభించిందన్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా 99వ ర్యాంకు సాధించినట్లు తెలియజేసారు. టీచింగ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్‌, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌, గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్‌, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ, పీఆర్‌ పర్‌సెప్షన్‌ కేటగిరీల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కర్‌ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు లభించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి గ్రాంట్లు అందుతాయన్నారు. విజ్ఞాన్‌కు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు లభించడం వల్ల ప్రముఖ బహుళ జాతి కంపెనీలు వర్సిటీ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయన్నారు. విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం సమాజంలోని అన్ని రంగాల నుంచి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం వల్లే జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకును సాధించామన్నారు. యూనివర్సిటీలో ఉన్న రిసెర్చ్‌ సెంటర్స్‌, సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పరిశోధనలను ప్రోత్సహించడానికి దేశంలోని ప్రముఖ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కూడా ఏర్పరుచుకున్నామన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ఐక్యూఏసీ టీంను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img