Friday, December 1, 2023
Friday, December 1, 2023

అజాదీ కా అమృత్ మహోత్సవంలో నేడు 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ

గుంటూరు, ఆగష్టు 06, 2022:- దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేడు 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.  శనివారం ఉదయం ఆజాదీ కా  అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక జిల్లా కలక్టరేట్ నుండి 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ హెనీ కత్తెర క్రిస్టినా, శాసన మండలి సభ్యులు కే. ఎస్. లక్ష్మణ రావు, లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, తాడికొండ శాసన సభ్యులు డా. ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు షేక్. మహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి, రాష్ట్ర మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి జెండా ఊపీ ప్రారంభించారు.  ఈ భారీ ర్యాలీ కలక్టరేట్ నుండి ప్రారంభమై కంకరగుంట  ఫ్లై ఓవర్, స్వామి వివేకానంద విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది.  ర్యాలీ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 1 వ తేది నుండి 15 వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.  ముఖ్యంగా ఈ రోజు దాదాపు 6 వేల మందికి పైబడి  ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులు, ఎన్.సి.సి విద్యార్ధులు, డ్వాక్రా సభ్యులు, స్వచ్చంద సంస్థలతో 750 మీటర్ల జాతీయ జెండా తో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.  75 సంవత్సరాల క్రితం ఏ రకమైన పరిస్థితులు దేశ వ్యాప్తంగా ఉన్నాయో అనాటి అణచివేతలు, అవమానాలు వాటి నుండి ఎంతో మంది త్యాగ మూర్తుల ప్రతిఫలంగా ఏర్పడిన స్వాతంత్ర్యo 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా అనేక విధాలుగా మనం వారి స్పూర్తిని కలిగించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకు తెలియనటువంటి త్యాగధనులను గుర్తించే కార్యక్రమాలను, చారిత్రక కట్టడాలు సందర్సించుట, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సందర్శించుట, తదితర కార్యక్రమాలను 15 రోజుల పాటు నిర్వహించుకుంటున్నామన్నారు.  ఈ నెల 13, 14, 15 తేదీలలో ప్రత్యేకంగా హర్ ఘర్  తిరంగా కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర  వేసే విధంగా, అందులో ప్రజలను భాగస్వామ్యం చేసుకొని నిర్వహిస్తున్నామన్నారు.  దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను సచివాలయాల ద్వారా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాలను వాలంటీర్ల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.        ఈ ర్యాలీ కార్యక్రమంలో  పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పురప్రముఖులకు, స్వచ్చంద సంస్థలకు, విద్యార్ధులకు 750 మీటర్ల జెండా రూపకల్పనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూన్నామన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ హెనీ కత్తెర క్రిస్టినా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశ భక్తిని చాటిచెప్పేలా నేడు 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. శాసన మండలి సభ్యులు కే. ఎస్. లక్ష్మణ రావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో మన జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమం ఒక మహత్తర ఘట్టమని, ఉద్యమంలో అనేకమంది ఉరితీయబడ్డారని, మరెంత మందో బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు బలైనారన్నారు.  వారి త్యాగ ఫలితాలతో స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నదన్నారు.  ఈరోజు యువతలో ముఖ్యంగా విద్యార్థులు యువజనులో దేశభక్తి కొరవడిందని ఒక అధ్యాపకునిగా భావిస్తున్నానన్నారు. దీనిని పెంపొందించడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని భావిస్తున్నానన్నారు.  సుమారు ఆరు వేల మందితో  ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించిన  జిల్లా కలెక్టర్ మరియు వారి  యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.   శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం అంటేనే ఎన్నో కులాలు, మతాలు,ప్రాంతాలు, జాతులు కలయికని, అయినప్పటికీ కూడా ఈ దేశానికీ స్వాతంత్ర్య సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను మరచి అందరు భారతీయులమనే భావనను గుండెల నిండా నింపుకొని, రవి అస్తమించని సామ్రాజ్యవాదులను ఈ దేశం నుండి తరిమి కొట్టిన నాటి పరిస్థితులను గుర్తు చేసుకుందామన్నారు.  స్వాతంత్ర్యo వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా మరోసారి కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు ముఖ్యంగా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్దంగా ఉన్నారనే భావన కలిగించేలా వేడుకలు   చేస్తున్నామన్నారు.  దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలు  చేత పట్టుకొని జాతీయ సమైక్యతను చెప్పే కార్యక్రమాన్ని తిసుకువచ్చారన్నారు. భావితరాలకు సంబంధించి స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన ఫలితాలు, త్యాగాలు, మరో ప్రక్క యువతరానికి  తెలియజెప్పేల  కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.   గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ సభ్యులు షేక్. మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ  దేశంలోని ప్రజలు కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఇది  ఎంతోమంది  త్యాగాల ఫలితమన్నారు.   స్వాతంత్రం  దేశంలో చక్కటి వాతావరణాన్ని నెల కొలిపి   రాబోయే తరాలు స్వేచ్ఛగా, కలిసిమెలిసి జీవించేలా దోహదపడుతుందన్నారు.  తాడికొండ శాసన సభ్యులు డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన లబ్దిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల లబ్దిని వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారన్నారు.  నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం అనంతరం ట్రిపులేక్స్ సోప్ కంపెనీ అధినేత అరుణాచలం మాణిక్య వేల్ ను దుశ్శాలువాతో  జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సన్మానించారు.   కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, డీఆర్ ఓ చంద్ర శేఖర రావు, ఆర్డీఓ ప్రభాకర రెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాస రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి, డీఈఓ శైలజ, తహశీల్దార్ సాంబశివరావు, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శ్రీనివాస్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్ర గిరి ఏసురత్నం, జిల్లా అధికారులు, విద్యార్దిని విద్యార్దులు  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img