Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సాగర్ జలాశయానికి భారీ ఇన్ ఫ్లో

26 క్రస్ట్ గేట్ల ఎత్తివేత

విశాలాంధ్ర,మాచర్ల/విజయపురిసౌత్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు గురువారం సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి 4,35,466 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు గా ఉండగా ప్రస్తుతం 588.00 అడుగుల్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు సాగర్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లో గా 3,36,672 లక్షల  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306.1010 టీఎంసీలకు చేరుకొంది. రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న ముంపు ప్రాంత గ్రామ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేయడంతో నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా చేరుకోవటంతో ఈ ప్రాంతం సందడిగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img