Monday, September 26, 2022
Monday, September 26, 2022

యంటియంసి ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

వేడుకల సందర్భంగా జరిగిన ర్యాలీ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
వేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, కమీషనర్

తాడేపల్లి : 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “అజాదీ కా అమృత మహోత్సవ్” కార్యక్రమం సందర్భంగా యంటియంసి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉండవల్లి సెంటర్ నుంచి ఉండవల్లి గుహలు వరకు ” హెరిటేజ్ వాక్ ” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా ఉండవల్లి సెంటర్లో ర్యాలీ ని జిల్లా కలెక్టర్,వేణుగోపాల
రెడ్డి,జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్ నుంచి ప్రఖ్యాత గాంచిన ఉండవల్లి గుహలు వరకు వందలాది మంది జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుహలు వద్ద జాతీయ రంగులతో కూడిన
బెలూన్స్ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,ఎస్పీ తోపాటు జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సబ్ కలెక్టర్ మీనానిధి, జిల్లా అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్, యంటియంసి కమీషనర్ యు. శారదా దేవి, అడిషనల్ కమిషనర్ హేమమాలినిరెడ్డి, మరియు డిఈ కృష్ణారెడ్డి,శానిటేషన్ సెక్రెటరీ పి.శ్రీనివాసరావు,
యంటియంసి పరిధిలోని ఇండోర్, ఔట్ డోర్, సచివాలయ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది,వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img