Friday, April 19, 2024
Friday, April 19, 2024

మంగళగిరిలో నేను పోటీ చేయటం అనివార్యం : లోకేష్

మంగళగిరిలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం లేదు అంటూ వస్తున్న వార్తల్ని నారా లోకేష్ ఖండించారు. బుధవారం టిడిపి మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో కేష్ మీడియాతో మాట్లాడారు కుప్పం నుండి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో మంగళగిరి నుండి తాను పోటీ చేయటం కూడా అంతే అనివార్యం అని అన్నారు. అయితే చంద్రబాబు సర్వేలో తనకు మంగళగిరిలో ప్రజాధరణ లేదని ప్రజలకు తాను న్యాయం చేయలేకపోయానని తేలితే అప్పుడు చంద్రబాబు మిగిలిన 174 స్థానాల్లో ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు.

ఆ నిధులు ఏమయ్యాయ్?

మంగళగిరి నియోజకవర్గంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నాననే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,600 కోట్లు కేటాయించారని అందులో రూపాయి కూడా మంగళగిరి అభివృద్ధికి ఖర్చు చేయలేదని లోకేష్ అన్నారు. ఆ నిధుల్ని ఖర్చు చేసి ఉంటే మంగళగిరిలో సమస్యలు ఉండేవి కాదని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న రైతు బజార్ రాజన్న క్యాంటీన్ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు తనకు కులమత బేధం లేదని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం అని పేర్కొన్నారు. గంజి చిరంజీవి కన్నా సీనియర్లు ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి ప్రాధాన్యత కలిగిన పదవిని ఇచ్చామని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ మంగళగిరి ప్రజలకు తన సొంత ఖర్చులతో అనేక సేవలందించానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img