Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇన్‌లైన్‌ హాకీ ఫెడరేషన్‌ కప్‌2022 పోటీల్లో సత్తా చాటిన కేఎల్‌యూ విద్యార్థి

విశాలాంధ్ర`తాడేపల్లి : రాజస్థాన్‌లోని జోద్పూర్‌లో జూలై 26 నుంచి 27 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్‌-లైన్‌ హాకీ ఫెడరేషన్‌ కప్‌-2022 పోటీల్లో కేఎల్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సత్తా చాటాడని అసోసియేట్‌ డీన్‌(ఆటలు మరియు క్రీడలు) డాక్టర్‌ కె.హరి కిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో బీబీఏ మూడవ సంవత్సరం చదువుతున్న డి.శివరామ్‌ ఇన్‌-లైన్‌ హాకీ ఫెడరేషన్‌ కప్‌-2022 పోటీల్లో పసిడి పతకం గెలుపొందాడని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించడంతో అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 13 వరకు అర్జెంటీనాలో జరగబోయే అంతర్జాతీయ ఓల్డ్‌ స్కేట్‌-2022 పోటీలకు ఎంపిక అయినట్లు వెల్లడిరచారు. పోటీల్లో ప్రతిభ చూపించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన శివరామను విశ్వవిద్యాలయ యాజమాన్యం, ఉపకులపతి డాక్టర్‌ సారధి వర్మ, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకట్రాం, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌, విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్‌ డాక్టర్‌ హనుమంతరావు, వ్యాయామ ఇన్‌చార్జ్‌ విభాగాధిపతి సుజాత, వ్యాయామ అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img