Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉండవల్లి సెంటర్‌లో కొడాలి నాని దిష్టిబొమ్మ దహనం

విశాలాంధ్ర`తాడేపల్లి : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో సోమవారం తాడేపల్లి పట్టణ రూరల్‌ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధారా దాసు, ఇట్టా భాస్కర్‌, బెజ్జం రామకృష్ణ, కాసిం ఖాన్‌, జ్యోతిబాస్‌, అన్నెం కుసుమ, కృష్ణవేణి, నాగుల్‌ మీరా, కంభం సాయిచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img