Friday, April 19, 2024
Friday, April 19, 2024

ధర్నాను జయప్రదం చేయండి

విశాలాంధ్ర`మాచర్ల : ఏపీ బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 10న కార్మిక శాఖ కార్యాలయాల ముందు ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌డి భాషా మేస్త్రి అన్నారు. స్థానిక విష్ణుప్రియ లాడ్జి సెంటర్‌లో సోమవారం జరిగిన యూనియన్‌ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు ఆ దిశలో పయనించటం లేదన్నారు. కార్మికుల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్ళించడం దుర్మార్గమన్నారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు మాట్లాడుతూ ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని, పెరిగిన ఇనుము, సిమెంట్‌ ధరలను తగ్గించాలని, 2019 నుంచి పెండిరగ్‌లో ఉన్న క్లైమ్‌లను వెంటనే మంజూరు చేయాలని, దారి మళ్లించిన నిధులను తిరిగి సంక్షేమ బోర్డులో జమ చేయాలని, పొరుగు రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలో కూడా కార్మిక సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికులకే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేపట్టిన ధర్నాను విజయవంతం చేసేందుకు కార్మికులంతా తరలిరావాలని వారు కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణు మొలకల అప్పారావు, బత్తిన శ్రీనివాసరావు, మాచర్ల చిన్నయేసు, చల్లా పిచ్చయ్య, ఉప్పుతోళ్ల అంజి, మాచర్ల బాబు, కడియం కోటేశ్వరరావు, ఉప్పుతోళ్ల ఆదినారాయణ, పరస వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img